calender_icon.png 25 September, 2024 | 11:54 AM

ట్రామ్ రైళ్లకు గుడ్ బై

25-09-2024 04:09:49 AM

సర్వీసులను నిలిపి వేయనున్న బెంగాల్

కోల్‌కతా, సెప్టెంబర్ 24: దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ట్రామ్ ట్రైన్ సర్వీసులకు ముగింపు పలకాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మంత్రి స్నేహాశీస్ చక్రబర్తి మంగళవారం ట్రామ్ సర్వీసులను నిలిపివేస్తామని ప్రకటన చేశారు. 1873లో గుర్రాలతో నడిచే ట్రామ్‌లు ప్రారంభమయ్యా యి.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇవి ఇంజన్‌తో కూడిన రైలు బోగీలుగా రూపాంతరం చెందాయి. ఇవి పూర్తిగా భూమి మీద ఓ ట్రాక్‌పై బస్సుల వలె నడుస్తుంటాయి. అయితే ఇవి నెమ్మదిగా నడవటం, రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బం ది పడుతున్నారు. అందుకే వీటి సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ ట్రైన్ సేవలను నిలిపివేస్తారన్న వార్త ల నేపథ్యంలో ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.