calender_icon.png 5 November, 2024 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహా వీడ్కోలు

05-11-2024 12:00:00 AM

రంజీ ట్రోఫీ అనంతరం గుడ్ బై

న్యూఢిల్లీ: భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయం సహా అన్ని రకాల ఫార్మాట్ క్రికెట్‌కు సోమవారం వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీ తన కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు. రంజీల్లో బెంగాల్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న సాహా భారత్ తరఫున 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. 2021లో టీమిండియా తరఫున చివరి టెస్టు ఆడిన సాహా టెస్టుల్లో మూడు శతకాలు, ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో తన ముద్రను చూపించిన సాహా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా, సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ధోని హయాంలోనే కెరీర్‌ను ఆరంభించిన సాహాకు జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు.