calender_icon.png 29 December, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి నడవడిక అలవర్చుకోవాలి

28-12-2024 07:00:04 PM

జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/ కళాశాలలో "పిల్లల సమగ్ర అభివృద్ధి" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బూర్ల మహేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు గురి అయి బంగారు భవిష్యత్తును వృధా చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలని తెలిపారు.

విద్యతో పాటు సామాజిక విలువలు జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు. సమాజంలో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహనీయులైన ఏపీజే అబ్దుల్ కలాం, ఎస్సార్ శంకరన్ లాంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. విద్య ద్వారా మాత్రమే మానవుని సంపూర్ణ వికాసం, అభివృద్ధి సమాజంలో గుర్తింపు, మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది చంద్రశేఖర్, బాల ప్రవీణ్, వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ యాదగిరి, పాఠశాల సిబ్బంది దురిశెట్టి సంతోష్, సునీల్, సట్ల శంకర్, ఆత్మారాం, రాజేంద్రప్రసాద్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.