calender_icon.png 18 January, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రధాన షెడ్యూల్ షురూ

10-08-2024 12:05:00 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు, -తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్‌లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అజిత్ విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.