calender_icon.png 9 January, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ

07-01-2025 12:00:00 AM

కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్ కథానాయకుడిగా వస్తున్న బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేక ర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నందున మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.

త్రిష ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఇదే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.