calender_icon.png 28 March, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండు గోవారీలను ఎస్టీల్లో చేర్చాలి

20-03-2025 02:03:33 AM

 స్పీకర్ కు ఎమ్మెల్యే పాయల్ వినతి

ఆదిలాబాద్, మార్చ్ 19 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న గోండు గోవారి లు రాష్ట్రంలో ఏ కులంలోనూ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

అందుకు వారిని ఎస్టీల్లో చేర్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను  జిల్లాకు చెందిన గుండు గోవారిల సంఘ ప్రతినిధులతో  హైదరాబాద్ లో  బుధవారం కలిసి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. తమ కులాన్ని ఏ జాబితాలో చేర్చకపోవడంతో తమ పిల్లలు చదువుకోలేకపోతున్నారని స్పీకర్ కు, మంత్రి కి వివరించారు. ఈ అంశంపై తాము చర్చించి సరైన న్యాయం చేసెల  చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.