రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రతాప్‌సింగ్
జైపూర్, అక్టోబర్ 30: ఆవులను బీజేపీ ప్రభుత్వం అగౌరవపరిచిందని రాజస్థాన్‌లోని కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రతాప్‌సింగ్ ఖచారియావాస్ ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార బీజేపీ వీధి ఆవులుగా పేర్కొంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఖండించారు. ఇది కచ్చితంగా గోమాతను అవమానించడమే నని అన్నారు. బీజేపీ ఆవులతో రాజకీయం చేస్తోంది. ఆవులు నిస్సహాయం గా ఉన్నాయని చెప్పడం అంటే వాటి రక్షణకు బీజేపీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే అర్థం. ఆవులకు తగిన సంరక్షణ అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొన్ని కారణాల వల్ల ఆవులు రోడ్లపై నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాయి. వాటిని వీధి ఆవులుగా పేర్కొనడం ఎంతమాత్రం సరికాదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. గోవుల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాగా, గోవధ నిషేధంతో పాటు ఆవును రాజ్యమాతగా గుర్తించాలని రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు 31 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు.