calender_icon.png 15 October, 2024 | 3:44 AM

గోమాత ప్రత్యక్ష దైవం

15-10-2024 01:36:57 AM

80 కోట్ల మంది హిందువులు ఒక్కటి కావాలి..

కేంద్రం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించే వరకు విశ్రమించొద్దు..

ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవి ముక్తేశ్వరానంద్ సరస్వతి

బెంగళూరులో గోధ్వజ స్థాపన చేసిన స్వామీజీ

బెంగళూరు, అక్టోబర్ 14: గోమాత ప్రత్యక్ష దైవమైని, గోవును ఆరాధిస్తే దైవాన్ని ఆరాధించినట్లేనని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. స్వామీజీ సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. స్వామీజీకి శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ చైర్మన్, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం స్వాగతం పలికారు.

తొలుత స్వామీజీ శివ నంది బసవేశ్వర్ ఉమామహేశ్వర్ మహాగణపతి నవగ్రహ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీ గోధ్వజ స్థాపన చేసి అనుగ్రహ ప్రవచనమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గోహత్యలను నిషేధించాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం గోవు పవిత్రతను గుర్తించి, గోవును రాష్ట్ర మాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జన్మనిచ్చిన తల్లి కంటే, విద్య చెప్పిన గురువు కంటే గోవు ఎంతో గొప్పదన్నారు. అందుకే వేదకాలం నుంచే రుషులు గురుకులంలో చేసిన తొలి రొట్టె గోవుకు పెట్టేవారని గుర్తుచేశారు. వేదాల్లో గోవు పవిత్రత గురించి వేలాది మంత్రాలు ఉన్నాయని, తానిప్పుడు కొత్తగా గోవు పవిత్రత గురించి చెప్పనక్కర్లేదని అభిప్రా యపడ్డారు.

గోవు మల, మూత్రాలు సైతం పవిత్రమైనవన్నారు. అంతటి పవిత్రమైన గోవును వధిస్తే మహాపాతకాలు తగులుతాయన్నారు. దేశవ్యాప్తంగా కొన్నికోట్ల మంది ఉన్న వారు కోరినవన్నీ నెరవేరుతాయని, కానీ, 80 కోట్ల మంది హిందువులు అడిగిన డిమాండ్లను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవని ధ్వజమెత్తారు.

హిందువులంతా ఒక్కటై గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించే వరకు విశ్రమించవద్దని సూచించారు. గోవధ చేస్తుంటే చూస్తూ ప్రభుత్వాలు ఊరుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా హిందువులు మేలుకోవాలని, గోమాతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

నేడు గోవాలో గోధ్వజ స్థాపన..

గోధ్వజ స్థాపన భారత్ యా త్రలో భాగంగా బుధవారం స్వామీ జీ  గోవాలో పర్యటించనున్నారు. శ్రీదత్త పద్మనాభం పీఠం, శ్రీక్షేత్ర తపో భూమిలో శిష్యగణంతో కలసి గోధ్వజ స్థాపన చేయనున్నారు.