calender_icon.png 26 December, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె వాహనాల టెండర్లలో గోల్‌మాల్!

03-11-2024 12:35:12 AM

  1. సింగరేణిలో బినామీలదే ఇష్టారాజ్యం
  2. ఇల్లెందులో ఒక్కొక్కరికి ఐదారు వాహనాలు

ఇల్లెందు, నవంబర్ 2: సింగరేణిలో అద్దె వాహనాల టెండర్ ప్రక్రియలో గోల్‌మాల్ జరిగినట్టుగా తెలుస్తున్నది. ఇల్లందు ఏరియాలో భూనిర్వాసితుడు కాని, సింగరేణి కార్మికుల కుటుంబానికి చెందని కోయగూ డెం ఉపరితలగనిలో టేకులపల్లికి చెందిన వ్యక్తికి ఐదు వాహనాలు రావడంతో టెండర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోయగూడెం ఉపరితలగని నిర్వాసిత గ్రామాలైన కిష్టారం, ధారపాడు గ్రామాలకు చెందిన వ్యక్తుల పేరుతో టెండర్లు వేసి వాహనాలన్నీ కైవసం చేసుకున్నట్టు తెలిసింది. కోయగూడెం ఉపరితలగనిలో ఉత్పత్తి ఎక్కు వ ఉన్న సమయంలో అప్పటి అధికారులకు సాధారణ కారును కేటా యించగా ఇప్పుడు స్కార్పియో వంటి విలాసవంతమైన వాహనాలు కేటాయించడంపై స్థానికులు అను మానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలో కూడా ఆ ఒక్క వాహనానికి లక్షల రూపాయలు పెట్టి కొనడానికి దళారులు పోటీ పడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నా యి. భూములు కోల్పోయిన వారికి సింగరేణి సంస్థ ఉపాధిలో భాగంగా టెండర్ కాపీ లో పొందుపరిచేది ఒక వాహ నం ఉండగా, అధికారులకు కేటాయించేది మరో వాహనం ఉంటుందని తెలిసింది.

నిర్వాసితుల పేరుతో బినామీలు వాహనాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సింగ రేణి అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.  భూములు కోల్పోయిన వారికి, సింగరేణి కార్మికుల వారసులకు సంస్థ న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.