08-04-2025 07:14:33 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సంఘం భవనం నందు లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు, శ్రీ భూషణ్ రావు లను మంగళవారం రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఇటీవల లీఫ్ ఫౌండేషన్ ఒంగోలు వారు భద్రాద్రి అహోబిల మట్టం నందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో గోళ్ల భూపతి రావుకు లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం, భూషణ్ రావుకు సేవా భూషణ్ అవార్డ్ ప్రదానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మంగళవారం విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనం నందు గోళ్ల భూపతి రావు, భూషణ్ రావు లను రోటరీ మాజీ గవర్నర్ భూసిరెడ్డి శంకర్ రెడ్డి సన్మానించారు. వీరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమనికి వెంకన్న సెక్రటరీ, హనుమంత్ రావు ట్రెజరర్ తులసీదాస్, డాక్టర్ విజయ రావు, గోపి, మణికుమారి, రామచందర్ రావు, భాస్కర్, శేఖర్, వేంకటేశ్వర్లు యశోదా ఫౌండేషన్, మేకల లత పాల్గొన్నారు.