calender_icon.png 29 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్ణ నీటిని విడుదల చేయించాలి

27-01-2025 06:18:53 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్వర్ణ పరివాహక ప్రాంతాల్లో రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు స్వర్ణ నీటిని స్వర్ణ వాగులో విడుదల చేసేలా చూడాలని కోరుతూ రైతులు సోమవారం డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావును కోరారు. నిర్మల్ మండలంలోని వెంగవాపేటి తల్వేద చిట్యాల గ్రామాల రైతులు శ్రీహరి రావును కలిసి సమస్యను వివరించారు. స్వర్ణ వాగులో మోటర్ల ద్వారా పంటను సాగు చేసుకుంటున్నా రైతులకు ప్రస్తుతం నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు తెలిపి సమస్య పరిష్కారమైన చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాదశి దర్శన్, విజయ్ కుమార్, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.