calender_icon.png 20 November, 2024 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బందీఖానాగా బంగారు తెలంగాణ

14-09-2024 03:15:00 AM

మంత్రులు గూండాగిరి చేస్తున్నారు

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నరు

బీఆర్‌ఎస్ లీడర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్  

రాజేంద్రనగర్, సెప్టెంబర్13: బంగా రు తెలంగాణను బందీఖానాగా మా ర్చారని బీఆర్‌ఎస్ లీడర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. సీఎం రేవం త్‌రెడ్డి, కాంగ్రెస్ సర్కారు హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం బండ్లగూడ జాగీర్‌లోని తన నివాసంలో ఆయన  మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై గాంధీ హత్యాయత్నం చేసి నా పోలీసులు ఇప్పటివరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను  బ్రాండ్ ఇమేజ్‌ను పెంచితే దానిని రేవంత్‌రెడ్డి తగ్గించారని ధ్వజమెత్తారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూం డాలుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఛోటా భాయ్, బడా భాయ్‌గా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పు డు దానం నాగేందర్ కుక్కిన పేనులా ఉన్నాడని, ఇప్పుడు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కౌశిక్ ఎక్కడా ప్రాంతీయవాదం రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, గాంధీ చేసిన కామెంట్లపై మాట్లాడారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రిగా కోమటిరెడ్డి తమ పదవులకు ఏమాత్రం అర్హులు కాదన్నారు.

సీఎం భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు బయట తిరగకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని మం డిపడ్డారు. గాంధీ దరఖాస్తు చేయకపోయినా పీఏసీ పదవి కట్టబెట్టారని ధ్వజ మెత్తారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులు సంయమనంతో వ్యవహరిస్తు న్నారని పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసేందుకు తమకు అపా యింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ, సైదు లు, మాలతీనాగరాజు, అరుణక్వీన్ ఎలిజబెత్, జంపన్న, భీమయ్య, నటరాజ్, అంజన్‌కుమార్ ఉన్నారు.