09-04-2025 12:49:05 AM
రాజాపూర్ ఏప్రిల్ 8: మండల పరిధిలోని ఇదిగానిపల్లి గ్రామంలో మంగళవారం బంగారు మైసమ్మ అమ్మవారి బోనాలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లతో, పోతురాజుల విన్యాసాలతో బోనాలు ఊరేగింపు నిర్వహించారు.
మహిళలు మట్టి కుండలో వండిన నైవేద్యంతో కూడిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఇదుగానిపల్లి ప్రజలతో పాటు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.