calender_icon.png 30 April, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు

28-04-2025 02:08:37 AM

జగిత్యాల, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్సెస్సీ పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. 1974-75 విద్యా సంవత్సరం గవర్నమెంట్ జూనియర్ కళాశాల కోరుట్లలోని హైస్కూల్లో ఎస్సెస్సీ చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.

ఈ ఏడాదితో వారు 10వ తరగతి పూర్తి చేసి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అలనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు గుర్రాల గోపాల్, బాలగంగాధర్’లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి పూర్వ విద్యార్థులు ధనుంజయ్, చౌల పరంధాం, అశోక్ కుమార్, బూరుగు రామస్వామిగౌడ్, కంటె బుచ్చి రాజం, తునికి సత్యనారాయణ, బింగి భూమానందం, పాలెపు రాజేశ్వరశర్మ, డాక్టర్ అల్లె మహాదేవ్, మానుక ప్రవీణ్, పిన్నంశెట్టి ఆనంద్’తో పాటూ 68 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.