03-03-2025 12:00:00 AM
పటాన్‌చెరు, మార్చి 2 : క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి. రాజు అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో రాష్ర్టస్థాయి ఆర్చరీ ఇంటర్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉప్పల్ మెరీడి యన్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న చామల లక్ష్మి అభయ రెడ్డి మొదటి స్థానం సాధించి బంగారు పథకాన్ని అందుకున్నారు. ఇందులో విజయం సాధించిన క్రీడాకారులు విజయవాడలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో చామల లక్ష్మి అభయ రెడ్డి ప్రథమ, శ్రీనిధి ద్వితీయ, హేమలత తృతీయ స్థానం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రామారావు, కో స్రవంతి పాల్గొన్నారు.