24-02-2025 12:41:18 AM
దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 11:54 గంటలకు ఆవిష్కరించారు. ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.
ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి వేద శాత్తుమరై, ఉదయం 11:54 నిమిషాలకు మూల నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుమూహూర్తన స్వామివారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్స వం నిర్వహించారు. మహారాజ భోగ నివేదన పెరియాశాత్తుమరై వేడుకలను పాం చరాత్రాగమ శాస్త్రానుసారంగా రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయనీయులు, అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించారు.
దేవాలయ చరిత్రలోనే ఒక మరుపురాని అపూర్వ సువర్ణ అధ్యాయమే ఈ సువర్ణ దివ్య విమాన గోపుర మహా కుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవం అని జీయర్‌స్వామి పేర్కొన్నారు. సుదర్శన చక్ర దర్శనం సమస్త భూత ప్రేత పిశాచ అనారోగ్య నివారకమని స్థల పురాణం తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఎంపీ చామల కిరణ్ కుమా ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రె డ్డి, వేముల వీరేశం, మఠాధిపతులు, యాదా ద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగతం
స్వర్ణ గోపురం ఆవిష్కరణకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజాప్రతినిధులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచ నం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. బం గారు స్వర్ణ గోపర జ్ఞాపికలను అందజేశారు.
రాష్ట్రంలోనే ఎత్తున ప్రథమ స్వర్ణగోపురం
రాష్ట్రంలోనే ఎత్తున ప్రథమ స్వర్ణతాపడ గోపురం ఇదేనని సంబంధిత అధికారులు తెలిపారు. 50.5 అడుగుల ఎత్తు, 10,759 చదరపు అడుగుల వైశాల్యం ఉందన్నారు. 68 కిలోల బంగారం కేటాయించగా, రూ. 80 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.