27-02-2025 12:00:00 AM
బూర్గంపాడు ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) :బూర్గంపాడు మండలం మోతెగడ్డ శ్రీ వీరభద్రుడికి తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య కుమారుడు, ప్రవాస భారతీయులు తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని రూ.20 లక్షల విలువైన స్వర్ణ కిరీటాలను బహుకరించారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారికి కిరీటాలను అందించారు.
ఈ సందర్భంగా ఆలయం తరపున ధాతలను శాలువాలతో సత్కరించారు. అనంతరం తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ... శివరాత్రి సందర్భంగా వీరభద్రుడికి స్వర్ణ కిరీటాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. గతంలోనూ ఆలయ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేశామని వివరించారు. భవిష్యత్తులో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరి ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, చిగురుమళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.