calender_icon.png 21 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఏడాదిలో 3,000 డాలర్లకు పసిడి

21-11-2024 01:27:39 AM

గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 20: వచ్చే 2025లో ఔన్సు బంగారం ధర 3,000 డాలర్లను చేరుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా వేసింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల కొనుగోళ్లు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు పుత్తడి ధరల్ని ఎగదోస్తాయని గోల్డ్‌మాన్ శాక్స్ అనలిస్టులు విశ్లేషిస్తూ 2025 డిసెంబర్‌కల్లా 3,000 డాలర్లకు పెరుగుతుంద న్నారు.

పలు కేంద్ర బ్యాంక్‌లు, ప్రత్యేకించి యూఎస్ ట్రెజరీ రిజర్వ్‌లు అధికంగా కలిగివున్న బ్యాంక్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడే బదులు వాటివద్ద ఉన్న ట్రెజరీ బాండ్లలో కొంతభాగాన్ని  బంగారంలోకి మళ్లిస్తాయని అనలిస్టులు వివరించారు.

మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఆర్థిక స్థిరత్వం పట్ల ఆందోళనలు సురక్షిత మదుపు సాధనమైన బంగారానికి డిమాండ్ పెంచుతాయని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో బంగారం 20 శాతంపైగా పెరగవచ్చని అంచనా వేసింది. 

మూడు రోజుల్లో రూ.2,000 పెరిగిన బంగారం

ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ దేశం లో బంగారం ధర వరుసగా మూడు రోజూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర  రూ.77,500 స్థాయిని దాటేసింది. సోమవారం రూ.660, మం గళవారం రూ. 760 చొప్పున పెరిగిన తులం ధర బుధవా రం మరో రూ.550 అధికమై రూ. రూ.77, 620 వద్దకు చేరిం ది. వరుస మూడు రోజుల్లో ఇది రూ. ,970 ఎగిసింది. 

22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ. 500 పెరిగి రూ.71,150 వద్ద నిలిచింది. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య తాజా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హఠాత్తుగా పెరిగింది. వరుస మూడు రోజుల్లో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 100 డాలర్ల మేర ఎగిసి కడపటి సమాచారం అందేసరికి 2,645 డాలర్ల వద్ద కదులుతున్నది.