calender_icon.png 8 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ

08-11-2024 11:06:58 AM

హైదరాబాద్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం అపహరణకు గురైంది. మండపేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిల బ్యాగులో నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. బంగారం చోరీకి గురైనట్లు మహిళ నార్కట్ పల్లి వద్ద గుర్తించింది. దీంతో డ్రైవర్ బస్సును అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. బంగారం చోరీపై పోలీసులు ప్రయాణికులను విచారించారు. అనంతరం ప్రయాణికులను అదే బస్సులో పోలీసులు హైదరాబాద్ కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  బాధితురాలితో కలిసి బస్సు ఆపిన ప్రాంతాలకు పోలీసులు వెళ్లారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.