రామాయంపేట: మెదక్ లో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో రామయంపేట కస్తూరిబా విద్యాలయానికి చెందిన హారిక బంగారు పతకాన్ని సాధించింది. 17 సంవత్సరాల లోపు విభాగంలో కే. దినేష్ కూతురు హారిక బంగారు పతకం సాధించినట్లు కోచ్ హరి తెలిపారు. ఈమెతో పాటు రామాయంపేట చెందిన మరో ఏడుగురు మెడల్స్ అందుకున్నారు.