హైదరాబాద్, జనవరి 15: పలు వారాల తర్వాత మళ్ళీ బంగారం ధర రూ.80,000 స్థాయిని దాటింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల పసిడి ధర బుధవారం రూ.1,100 పెరిగి రూ. 80,070 వద్డ కు చేరింది. 22 క్యారట్ల ఆభరణాల పుత్తడి ధర రూ.1,000 ఎగిపి రూ. 73, 400 వద్డ కు చేరింది.
ప్రపంచ మార్కెట్లో ధర అధికకావడం, మరోవైపు డాలరు పడిపోవడంతో పుత్తడి ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔ న్సు బంగారం ఫ్యూచర్ రెండు నెలల గరిష్ఠస్థాయి 2,711డాలర్ల స్థాయికి పెరిగింది. దీని తో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్ రూ.470 వరకూ పెరిగి రూ.78,400 వద్దకు చేరింది.