calender_icon.png 22 October, 2024 | 2:22 AM

బంగారం రికార్డు పరుగు

19-10-2024 12:00:00 AM

  1. ప్రపంచ మార్కెట్లో 2,700 డాలర్లపైకి ఔన్సు ధర
  2. హైదరాబాద్‌లో రూ.79,000కు చేరువైన తులం ధర

హైదరాబాద్, అక్టోబర్ 18: ప్రపంచ ప్ర ధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్‌లో బంగారం ఏ రోజుకారోజు కొత్త రికార్డులు సృష్టిస్తూ పరుగులు తీస్తున్నది. తాజా అటు అంతర్జాతీయ మార్కెట్లో నూ, ఇటు దేశీయంగానూ సరికొత్త రికార్డు స్థాయికి పుత్తడి పెరిగింది.

ప్రపంచ మార్కె ట్లో ఔన్సు బంగారం ధర చరిత్రలో తొలిసారిగా 2,700 డాలర్ల స్థాయిని మించి 2,720 డాలర్ల వద్దకు చేరింది. ప్రపంచంలో ఇన్వెస్టర్ల డిమాండ్‌కు తోడు స్థానిక మార్కెట్లో రానున్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలు పుత్తడి జొరుకు కారణమయ్యిం ది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర శుక్ర వారం రూ.79,000కు చేరువయ్యింది. ఈ ఒక్కరోజులోనే రూ.870 పెరిగి కొత్త రికార్డుస్థాయి రూ.78,980 వద్దకు చేరింది.అక్టోబర్ తొలివారంలో నమోదైన రూ.77,670 రికార్డు ధరను రెండు రోజుల క్రితం అధిగమించి వరుస మూడు రోజుల్లో రూ.2,000 మేర ఎగిసింది.

తాజాగా ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం తులం ధర  రూ.800 పెరిగి రూ.72,400 వద్దకు చేరుకున్నది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.80,000 సమీపానికి చేరింది.

రూ.1,05,000కు కేజీ వెండి

బంగారం బాటలోనే వెండి ధర కూడా హైదరాబాద్‌లో కొత్త రికార్డుస్థాయికి పెరిగింది. తాజాగా కేజీ వెండి ధర రూ.2,000 మేర పెరిగి రూ.1,05,000 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 32.32 డాలర్ల వద్దకు చేరింది. 

పెరుగుదలకు పలు కారణాలు

పలు ప్రపంచ బ్యాంక్‌లు సరళ ద్రవ్య విధానాలవైపు మళ్లడం కూడా బంగారం ధరలకు మద్దతు లభిస్తున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీని యర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చె ప్పారు.  తాజాగా యూరోపియన్ సెం ట్రల్ బ్యాంక్ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించిందని, యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరో దఫా వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలు వెలువడుతున్నాయన్నారు.

యూఎస్ అధ్యక్ష ఎన్నికలు కొద్ది వారాల్లో ఉన్నందున అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత సాధనంగా పరిగణిస్తూ ఇన్వెస్టర్లు పుత్తడిని కొంటున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోది వివరించారు. పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల కొనుగోళ్లు పెరిగాయని, అలాగే ప్రస్తుత మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నడుమ సురక్షిత సాధనంగా పరిగణించి ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని స్థానిక బులియన్ ట్రేడర్లు వివరించారు.