calender_icon.png 25 October, 2024 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు..

25-10-2024 12:00:00 AM

ముంబయి: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టా యి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారెట్లు) ధర రూ.300 తగ్గి రూ.81,200కు పడిపోయింది. బంగారానికి జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ వర్గాలు అంటు న్నాయి. ఈ వారం తులం బంగారం (24 క్యారెట్స్) రూ.81,500లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది.

మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.1000 తగ్గి రూ.1.01 లక్షలకు చేరుకున్నది. 99.5 శాతం స్వచ్ఛత గల తులం బంగారం రూ.300 తగ్గి రూ.80,800 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్ కాంట్రాకట్స్ తులం ధర రూ.549 వృద్ధి చెంది 78,361 వద్ద నిలిచింది.