హైదరాబాద్: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటుగా శ్రావణమాసం సమీపిస్తుండడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. శ్రావణ మాసంలో పండుగలు, వ్రతాలు, నోములతో పాటుగా పెళ్లిళ్లు. ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో బంగారం కొనుగోలుకు డిమాండ్ ఉంటుంది. దీంతో ఇప్పటినుంచే ధర పెరుగుతూ వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 10 గ్రాములపై దాదాపు రూ.5 వేలదాకా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభమైంది.
ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.500 పెరిగి రూ.63,550గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.69,320గా ఉంది. ముంబయిలో ఈ ధరలు వరసగా రూ.63,400, రూ.69,170గా ఉండగా, చెన్నైలో రూ. 64,170, రూ.69, 970గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.69,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి కిలోకు రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.88,900గా ఉంది.