14-02-2025 01:36:25 AM
హైదరాబాద్: వారం రోజుల తరువాత గోల్డ్ రేటు తగ్గింది అనుకునే లోపలే.. మళ్ళీ పెరిగింది. దీంతో మళ్ళీ బంగారం ధరలలో కదలికలు ఏర్పడ్డాయి. గురువారం తులం పసిడి ధర గరిష్టంగా రూ.87050 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్ రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,050 వద్ద నిలిచాయి. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. వెండి రేటు మాత్రం ఎనిమిదో రోజు స్థిరంగానే ఉంది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది.