calender_icon.png 17 January, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం ధరకు మళ్లీ రెక్కలు

09-01-2025 12:00:00 AM

హఠాత్తుగా రూ.1,100 పెరిగిన తులం ధర

హైదరాబాద్, జనవరి 8: కొద్ది రోజులుగా పరిమిత శ్రేణిలో ఉన్న బంగారం ధర బుధవారం ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచ మార్కె ట్లో ధర అధికకావడం, మరోవైపు రూపాయి మరింత పడిపోవడంతో పుత్తడి ధర పెరిగిందని బులియన్ ట్రేడర్లు చెపుతున్నారు.  హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర  రూ.1,100 పెరిగి రూ. 78,820 వద్ద ముగిసింది. 

22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర  రూ. 1,000 ఎగిసి రూ.72,250 వద్ద నిలిచింది. న్యూఢిల్లీ మార్కెట్‌లో పూర్తి స్వచ్ఛత కలిగిన పసిడి ధర తిరిగి రూ.80,000 స్థాయిని అం దుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ 15 డాలర్ల మేర పెరిగి 2,665 డాలర్ల స్థాయికి పెరిగింది. దీనితో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో రూ. 400 వరకూ పెరిగగి రూ.77,800 వద్దకు చేరింది.

10 గ్రాముల పసిడి ఫ్యూచర్ దేశీయంగా రూపాయి క్షీణత ఫలితంగా బంగా రం తదితర లోహాల ధరలు అధికమవుతాయని బులియన్ విశ్లేషకులు తెలిపారు. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,౦౦,౦౦౦ వద్ద కదలుతోంది. ప్రపంచ మార్కెట్‌లో ఔన్స్ వెండి ఫ్యూచర్ ధర ౩౧ డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతున్నది.