calender_icon.png 9 February, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

09-02-2025 12:52:47 AM

హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. శుక్రవారం పెరుగుదలకు బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రా ల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగా రూ.79,450కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరిగి రూ. 86,670కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే స్థాయిలో ధరలుపెరిగాయి.  చెన్నై, బెంగళూరు, ముంబైలలో కూడ ఇదే స్థాయిలో పెరిగాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.79,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 86,670 వద్ద కొనసాగుతోంది.