30-01-2025 12:34:45 AM
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు రోజులు గా తగ్గుముఖంలో ఉన్న పసిడి ధరలు ఉన్నట్టుండి షాకిచ్చాయి. ఇటీవల రోజుల్లో ఎప్పు డూ లేనంత స్థాయిలో బుధవారం బంగా రం ధరలు ఎగిశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖప ట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూ రు వంటి ప్రాంతాల్లో బుధవారం బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.850 (22 క్యారెట్స్), రూ.920 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి.
దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 75,950కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,850 వద్దకు ఎగిశాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.83,000 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.76,100 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధర లు వరుసగా రూ.920, రూ.850 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
చైన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 850 పెరిగి రూ. 75,950 వద్దకు, 24 క్యారె ట్ల గోల్డ్ ధర రూ.920 ఎగిసి రూ. 82,850 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాం తాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటిమార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజ యవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్ద, ఢిల్లీలో రూ. 96,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.