calender_icon.png 22 December, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా పెరిగిన బంగారం ధరలు

02-08-2024 01:06:00 AM

హైదరాబాద్: బంగారం ధరలు భారీగా పెరిగాయి. సోమవారంనుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న క్రమంలో గురువారంనుంచే ధరల పెరుగుదల ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గురువారం పది గ్రాముల 22 కారెట్ల బంగారం ఒక్క రోజే రూ.820 పెరిగి రూ.64,1010కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం రూ.890 పెరిగి రూ.69,830గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని మిగతా నగరాల్లో కూడా ఇదే ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,980గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్లు రూ. 64,010గా, 24 క్యారెట్లు రూ. 69, 830గా ఉంది. కాగా చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.64,210గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,050గా ఉంది.