06-04-2025 12:47:40 AM
అదే దారిలో వెండి ధరలు కూడా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు బంగారం ధరలు దిగొచ్చాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా పతనం అయ్యాయి. అంతర్జాతీయంగా పుత్తడి ధరలు దిగడంతో ఆ ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. బంగారంపై పెట్టుబడి పెట్టిన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బం గారం ధరలు నేలచూపులు చూశా యి. ఈ లాభాల స్వీకరణకు ట్రం ప్ సుంకాలు కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగితే పుత్తడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో పోల్చి నపుడు రూపాయి విలువ కూడా కొంత మేర బలపడింది. శుక్రవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 900 తగ్గి రూ. 83,100గా నమోదు కాగా.. 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల ) బంగారానికి రూ. 980 తగ్గి రూ. 90,660గా ఉంది. ఇక కిలో వెండికి రూ. 1,03,000 ధర పలుకుతోంది.