calender_icon.png 6 March, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిడి ధర పైపైకి

25-01-2025 12:00:00 AM

తొలి సారి రూ.83 వేలు దాటిన బంగారం

న్యూఢిల్లీ: సామాన్యుడికి అందనంతగా దూరమవుతున్న బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా గత కొంతకాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల  బంగారం ధర రూ.83 వేలు దాటింది. పసిడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.200 పెరిగి రూ.83,100కు చేరుకున్నట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.99.5 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం కూడా రూ.200 పెరిగి రూ.82,700కు చేరింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ.500 మేర పెరిగింది.

క్రితం ట్రేడింగ్‌లో రూ.93,500గా ఉన్న వెండి  తాజాగా రూ. 94 వేల మార్కుకు చేరిం ది.దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇంచుమించుగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీ య మార్కెట్లో బంగారం ఔన్స్ ధర  2780 డాలర్ల వద్ద కొనసాగుతుండగా వెండి 31.32 డాలర్ల వద్ద ్రట్రేడ్ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడిని భావించడంతో దీనికి డిమాండ్ పెరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.