న్యూఢిల్లీ: బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజ ధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.190 తగ్గి, రూ. 78,960లకు చేరుకున్నది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.79,150 వద్ద స్థిర పడింది. సోమవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.190 తగ్గి రూ.78,560 పలికింది. శుక్రవా రం ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్స్ బంగారం తులం ధర రూ.78,750 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.410 వృద్ధి చెంది రూ.77,029 లకు చేరింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.738 వృద్ధితో 93,186 పలికింది.మరోవైపు, సోమవారం కిలో వెండి ధర రూ.350 పుంజుకుని రూ.93,850 లకు పుంజుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.93,500 వద్ద ముగిసింది.