calender_icon.png 16 March, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు పెరిగిన బంగారం ధర

14-03-2025 12:00:00 AM

ఆల్‌టైమ్ గరిష్ఠానికి పుత్తడి

న్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ డిమాండ్ వల్ల 10 గ్రాముల పుత్తడికి రూ. 600 పెరిగి రూ. 89,450కి చేరుకుంది. కొద్ది రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మరోమారు పెరిగాయి. ఇక కిలో వెండికి రూ. 1000 మేర పెరిగి కేజీకి రూ. 1,01,200కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 2946 డాలర్లకు చేరుకుంది. అంచనాల కంటే తక్కువగా ద్రవ్యోల్బణం నమోదు కావడం అంతే కాక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే కారణాలతో బంగారంపై అనేక మంది పెట్టుబడులు పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.