* 11 నెలల్లోనే 32 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర లు ధగధగమని మెరుస్తున్నాయి. గురువారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ. 17 వృద్ధితో రూ.82,900లకు చేరుకుని తాజాగా మరో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం తులం బంగారం ధర రూ. 82,730 వద్ద ముగిసింది.
గతేడాది ఫిబ్రవరి 23న రూ.62,720 పలికిన పది గ్రాముల బంగారం ధర గురువారం (2025 జనవరి 23) రూ.82,900 పలికింది. అంటే 11 నెలల్లోనే బంగారం బంగారం తులం ధర రూ. 20,180 (32.17 శాతం) పెరిగింది. ఇదిలా ఉంటే గురువారం కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.93,500 పలికింది. బుధవారం కిలో వెండి ధర రూ.94,000 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ గల బంగారానికి దేశీయ బులియన్ మార్కెట్లో రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.