calender_icon.png 21 January, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లాట్‌గా బంగారం ధర

21-01-2025 12:34:42 AM

* స్వల్పంగా తగ్గిన వెండి

న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంపై ఇన్వెస్టర్లందరూ దృష్టిని కేంద్రీకరించారు. ఫలి తంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,000 వద్ద ఫాట్‌గా  ఉంది. శుక్రవారం బులియన్ మార్కెట్లో రూ.700 వృద్ధితో రూ.82,000లకు చేరుకుంది.

99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.81,600 వద్ద ఫ్లాట్‌గా కొనసాగింది. గతేడాది అక్టోబర్ 31న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,400లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దాంతోపాటు 99.5శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.82 వేలు పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.500 పతన మై రూ.93,000 వద్ద నిలిచింది.

శుక్రవారం కిలో వెండి ధర రూ.93,500వద్ద ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీ ఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ గోల్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.62 తగ్గి రూ. 78,961లకు చేరుకుంది. మరోవైపు కిలో వెండి మార్చి కాంట్రాక్స్ ధర రూ.202 పతనమై రూ.91,400 వద్ద స్థిర పడింది. అంత ర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యం లో జనవరి నెలలో బంగారం ధర మూడు శాతానికి పైగా, వెండి ఏడు శాతానికి పైగా పెరిగింది.