29-01-2025 12:43:35 AM
హైదరాబాద్: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో నిన్నటి ధర తో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.75,100 (22 క్యారెట్స్), రూ. 81,930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. అయితే బంగారం ధరల్లో ఉన్న తగ్గుదల వెండిలో కనిపించలేదు. సోమవారం ధరలతో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతోంది. మంగళవారం కేజీ వెండిధర రూ.1,04,000 వద్ద ఉంది.