calender_icon.png 1 March, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన బంగారం ధర.. రూ.2 వేలు తగ్గిన వెండి

01-03-2025 12:56:20 AM

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా సరికొత్త రికార్డులను తిరగరాస్తూ దూసు కెళ్లిన బంగారం.. కాస్త నెమ్మదించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర శుక్రవారం నాటి కి రూ.500 మేర క్షీణించి రూ. 87,700కు చేరింది. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్‌లో ఈ మొత్తం రూ. 88,200గా ఉంది.

జ్యువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధర తగ్గుముఖం పట్టినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. జనవరి 1 నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ.79,390 గా ఉండగా.. రెండు నెలల వ్యవధిలో దాదాపు 10 శాతం మేర పెరిగి రూ.87,700 స్థాయికి చేర డం గమనార్హం. అటు వెండి సైతం భా రీగా తగ్గింది. గురువారం రూ. 98,500 గా ఉన్న కిలో వెండి ధర రూ.2,100 మేర తగ్గి రూ.96,400కు దిగి వచ్చింది.