న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండిండ్ల సీజన్ కొనసాగుతున్నా బంగారం ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.200 తగ్గి రూ.79,100కు చేరుకుంది. 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.78,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం పది గ్రాముల ధర రూ.79 వేల వద్ద ముగిసింది. ఇక సోమవారం కిలో వెండి ధర రూ.2,200 తగ్గి 90 వేల వద్ద స్థిరపడింది.