23-04-2025 01:39:52 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అంతర్జాతీ య మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగా రం ధరకు రెక్కలు వచ్చాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలకే కాదు సంపన్నులకు సైతం దడ పుట్టించేలా ధరలు ఎగ బాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాము ల బంగారం ధర మంగళవారం మధ్యాహ్నానికి దేశీయంగా రూ.లక్షకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. సోమవా రం ధరతో పోల్చుకుంటే మంగళవారం మరో రూ. 2వేలు పెరిగింది.
సాయం త్రం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,01,800గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీలలో కూడా ధరలు లక్ష దాటాయి. మున్ముందు బంగారం ధర లు మరింత పెరుగుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా చైనా మధ్య ప్రతీకార వాణిజ్య, సుంకాల అంతర్జాయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. దీనిలో భాగంగానే గోల్డ్ మార్కెట్ కూడా ప్రభావిత మవుతున్నది.