calender_icon.png 13 November, 2024 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రావెల్స్ బస్సులో బంగారు ఆభరణాలు చోరీ

09-11-2024 01:22:52 AM

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 8: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీకి గురైంది. బాధితురాలి కథనం ప్రకారం.. ఏపీలోని మండపేటకు చెందిన ఓ మహిళ శుక్రవారం ఉదయం 6 గంటలకు మండ పేటలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద రాగానే ప్రయాణికులు టీ తాగేందుకని డ్రైవర్ ఆపాడు.

అదే సమయంలో మహిళ తన బ్యాగులో చూసుకోగా అందులోని రూ.15 లక్ష ల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీకి గురైనట్లు గుర్తిం చి డ్రైవర్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ మధ్యలో నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లు హైవేకు ఆనుకొని ఉన్నప్పటికీ అక్కడ బస్సు ఆపకుండా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీ స్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆపాడు.

బాధితురాలు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు విషయం తెలపడంతో వారు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశా రు. ఆ తర్వాత బంగారం అపహరణకు గురైన ప్రాంతం తమ పరి ధిలోకి రాదని వెల్లడించారు. అది నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి.. ఇద్దరి పోలీసు సిబ్బంది, ట్రావెల్స్ సిబ్బందిని పంపించి నార్కట్‌పల్లిలో బస్సు ఆగిన టీస్టాల్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో కొనమెరుపు ఏంటంటే మహిళ బ్యాగులో బంగారు ఆభరణాలు పెట్టిందో.. లేదో ఆమెకే స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.