09-03-2025 02:15:13 PM
మంథని పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టిన బాధితులు
మంథని,(విజయక్రాంతి): మంథనిలో బంగారు వ్యాపారి కుటుంబంతో సహా గత రెండు వారాల క్రితం పరార్ కావడంతో మంథని పోలీస్ స్టేషన్ కు బాధితులు క్యూ కట్టారు. బాధితుల కథనం ప్రకారం... గత 30 సంవత్సరాలుగా మంథనిలో స్థిరపడ్డ మహారాష్ట్రకు చెందిన తండ్రి తోరత్ సీతారాం కుమారులు ప్రవీణ్, ప్రశాంత్ లు మంత్రి పట్టణంలో బంగారు వ్యాపారం చేస్తు ప్రజలను నమ్మించి మోసం చేశారు. వారిపై నమ్మకంతో బాధితులు బంగారం ఇచ్చారు. ఈ సంఘటన మంథనిలో సంచలనంగా మారింది. దాదాపు 52 మంది బాధితుల వద్ద నుండి 708 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండి, రూ. 52 లక్షల నగదు తీసుకొని బంగారు వ్యాపారస్తులు పరారయ్యారు. దీంతో బాధితులు మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు.