12-04-2025 11:12:15 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): సాంఘీక శాస్త్రం ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరుగుతుందని ముఖ్యంగా సమాజంలో నిర్వర్తించాల్సిన భాద్యతల గురించి స్పష్టంగా తెలుస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల(Alphores Educational Institutions) అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో విద్యార్థులకు జోనల్ స్థాయిలో నిర్వహించినటువంటి సాంఘీకశాస్త్ర ఒలంపియాడ్లో బంగారు పతకాలు(Gold medals) సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రశంసా పత్రాల ప్రధానం సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు సాంఘీకశాస్త్రంలో పట్టు సాధించాలనే పట్టుదల కల్గి ఉండాలని, విషయాలను సమగ్రంగా తెలుసువోడం, సమాజం పట్ల చక్కటి అవగాహన కల్గుతుందని తెలుపుతూ నేడు చాలా మంది అవగాహనలేమితో ఉండడం చాలా విచారకరమని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అన్ని రకాలుగా అత్యుత్తమ భోదనతో పాటు శిక్షణ ఇప్పిస్తు విషయంలో పట్టు సాదించే విధంగా ప్రణాళికను రూపొందించి చక్కగా అమలుపరుస్తున్నామని చెప్పారు. ఏ పోటీ పరీక్షల్లో అయిన ఈ అంశం గురించి ప్రశ్నలు అడుగుతారని మరియు ఈ అంశం ద్వారా విజయం పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ అంశం ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పాఠశాల స్థాయిలో చక్కటి శిక్షణను ఇస్తున్నామని, విజయమే లక్ష్యంగా ముందుకు పయనింపచేస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలో గత నెలలో న్యూఢిల్లీకి చెందినటువంటి ప్రముఖ పోట పరీక్షల సంస్థ అయిన సిల్వర్ జోన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి జోనల్ స్థాయి అంతర్జాతీయ సాంఘీక శాస్త్రం ఒలంపియాడ్లో పాఠశాలకు చెందినటువంటి బొంగోని కార్తికేయ, 6వ తరగతి, బంగారు పతకం, హరి శ్రీహరిణి, 8వ తరగతి, బంగారు పతకం, యం. విఘ్నేష్చంద్ర 8వ తరగతి, రజత పతకం, యం. హిమేశ్ చంద్ర, 9వ తరగతి, బంగారు పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు విజేతలకు అభినందనలు తెలియజేసి పుష్పగుచ్చాలతో పాటు ప్రశంసా పత్రాలను ప్రధానంచేసి భవిష్యత్ మరిన్ని ఘనవిజయాలను నమోదు చేసి పాఠశాలకు వన్నె తేవాలని చెప్పారు.