11-04-2025 01:21:21 AM
కొత్తపల్లి, ఏప్రిల్ 10: స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రేత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ వలన విద్యార్థులకు చాలా కీలకమైన అంశాలని వారికి విజయాలను అందించడంలో విశేష పాత్ర పోషిస్తుందన్నారు.
సిల్వర్జోన్ ఫౌండేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ పోటీలలో అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన యల్. రామన్, 7వ తరగతి బంగారు పతకం, యం. శివేన్రెడ్డి, 8వ తరగతి, రజత పతకం, యస్.పి. క్రిష్ణ చైతన్య, 8వ తరగతి, బంగారు పతకం, జి. సాయి నంహిత్, 9వ తరగతి, బంగారు పతకం, పి. శ్లోక, 9వ తరగతి, రజత పతకం, యం. హిమేష్ చంద్ర, 10వ తరగతి, బంగారు పతకం, డి. ఉదయ శ్రీ, 10వ తరగతి, రజత పతకం, పతకాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు.