calender_icon.png 18 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించిన మహిళకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం

10-04-2025 08:48:55 PM

కోదాడ: గృహిణి కనుమర్ల పుడి స్వప్న భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు నిర్విరామంగా పఠించడం, తద్వారా మైసూర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్త పీఠం ప్రతి ఏటా నిర్వహించే భగవద్గీత పారాయణం పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించడం, కోదాడ ప్రాంతానికే గొప్ప గర్వకారణం అని, ఆమె విజయం వెనుక భర్త రఘునాథ్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని కోదాడ వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు అన్నారు.

గురువారం నాడు కోదాడ లోని స్వప్న స్వగృహంలో శాలువాతో సన్మానించి, మేమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కోశాధికారి వెంపటి ప్రసాద్, ఆర్ సి బెలిదే భరత్ కుమార్, ఐపిసి లు పబ్బ గీతాదేవి, వంగవీటి లోకేష్, ఆర్ ఇ సి కొండూరు మాధవి, డిపిఓ బండారు శ్రీనివాసరావు, డి ఐ లు ఓరుగంటి రమాదేవి, యాదా రాణి, వాసవి క్లబ్ యూత్ అధ్యక్షులు యాద కిరణ్, వాసవి క్లబ్ సభ్యులు గరిణే శ్రీనివాసరావు, కె.రఘునాథ్ పాల్గొన్నారు.