calender_icon.png 19 April, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన అబ్దుల్ ఖలీల్

16-04-2025 07:41:32 PM

మాంచెస్టర్ లో జరిగిన తైక్వాండో పోటీల్లో బంగారు పతకం..

రాజేంద్రనగర్: నార్సింగికి చెందిన అబ్దుల్ ఖలీల్ మాంచెస్టర్ లో జరిగిన తైక్వాండో పోటీ(World Taekwondo Championships)ల్లో బంగారు పతకం సాధించాడు. గతంలో ఇతడు 11 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈనెల 13న యూకే లోని మాంచెస్టర్ లో జరిగిన 2025 బ్రిటిష్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో మన భారత్ నుంచి జే ఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, ఇండియా నుంచి పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ లో 12 దేశాల నుంచి పాల్గొన్నారు. ఇందులో నాలుగు వివిధ క్యాటగిరీలో అబ్దుల్ ఖలీల్  పాల్గొని అద్భుతమైన ప్రతిభ చాటాడు.

ఒక గోల్డ్ మెడల్, రెండు సిల్వర్ మెడల్, ఒకటి బ్రౌన్ మెడల్, గ్రాండ్ ఛాంపియన్ లో మధ్య పోటీలలో ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించాడు. సాధించిన మెడల్స్ అన్ని తన గురువు జయంత్ రెడ్డికి అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రోత్సాహం, ఆశీర్వాదంతో తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు ఈ సందర్భంగా అబ్దుల్ ఖలీల్ తెలియజేశారు. అదేవిధంగా తనకు నార్సింగి మాజీ సర్పంచ్ అశోక్, వెంకటేష్ యాదవ్ ఎంతో సహకరించినట్లు పేర్కొన్నారు. బుధవారం తన స్వస్థలం నార్సింగి చేరుకున్న అబ్దుల్ ఖలీల్ ను స్థానికులు నాయకులు పెద్ద ఎత్తున సత్కరించారు. మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.