calender_icon.png 12 March, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థినికి బంగారు పతకం

12-03-2025 12:35:26 AM

కరీంనగర్, మార్చి11 (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ షావోలిన్ కుంగ్ ఫు, పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నమెంటులో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తపస్విని బంగారు పతకం సాధించింది.

ఈ టోర్న మెంట్లో ఏడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, తెలంగాణలోని పలు జిల్లాల విద్యార్థులు పాల్గొనగా తపస్విని కుంగ్ ఫు 14 సంవత్సరాల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థిని తపస్వినిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు శ్రీ వేణి, విజయ లక్ష్మి పాల్గొన్నారు.