27-03-2025 12:00:00 AM
కల్లూరు, మార్చి 26: గత కొద్ది రోజుల క్రితం మండల పరిధిలోని కొర్లగూడెం, కప్పల బంధం రోడ్డు నందు గుర్తు తెలియని వ్యక్తులు గొలుసులు దొంగిలించారు. నిందితులను బుధవారం కల్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ రఘు వివరాలను తెలిపారు. నిందితుల్లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన మూడ్ రమేష్, మూడ్ గణేష్, వెంకటాద్రిగూడెంకి చెందిన కిరణ్ ఉన్నారు.
ముగ్గురు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 17న కొర్లగూడెం గ్రామంలో ఒక మహిళ మెడలోని 20 గ్రాముల బరువైన 65 వేల రూపాయలు బంగారు నానత్రాడుని లాక్కొని పారిపోయినారు. నమ్మదగిన సమాచారం మేరకు కప్పలబందం రోడ్డు వద్ద బుధవారం పోలీసులు రమేష్‌ను అరెస్టు చేశారు. గణేష్ కోసం గాలిస్తున్నారు.