calender_icon.png 24 October, 2024 | 12:06 AM

తాళం వేసిన ఇంటికి కన్నం.. బంగారం చోరీ

23-10-2024 09:27:32 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామరెడ్డి జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగుళ్ల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పంచము హనుమాన్ కాలనీలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివసించే హరిని యోగేష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తాళం ఇంటికి తాళం వేసి ఈనెల 21న సోమవారం బంధువుల ఇంటికి వరంగల్ కు వెళ్లారు.మంగళవారం రాత్రి ఇంటికి పక్కల వారు తన ఇంటి తాళం పాలుగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయని యోగేష్ కు సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటిలో నీ బీరువాలో ఉన్న 37 తులాల బంగారు అభన్నాలు వెండి వస్తువులు కొంత నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలానికి కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది ,పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మూడు బృందాలుగా విడిపోయి పోలీసులు నేరస్తులను పట్టుకోవడం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకొని తాళం వేసి వెల్లవద్దని గేటుకు తాళం బయటకు కనపడే విధంగా కాకుండా కనపడకుండా వేరొక వైపు తాళం వేసి వేళాలని తెలిపారు. విలువైన అభరణాలను నగదును, లాకర్ లా లో భద్రపరుచుకోవాలని కోరారు .కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద భారీ మొత్తంలో చోరీ జరగడం కలకలం సృష్టిస్తుంది. పాత నేరస్తుల పని అయి ఉంటుందని కొందరు భావిస్తుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలు  పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.