calender_icon.png 8 October, 2024 | 7:56 AM

బంగారం కొత్త పుంతలు

08-10-2024 02:38:01 AM

రూ.78,700లతో జీవిత కాల గరిష్ఠానికి చేరిక..!

న్యూఢిల్లీ: కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం తీసుకోవడం, ఇజ్రాయెల్,-ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు తమ పెట్టుబ డులకు స్వర్గధామంగా బంగారాన్ని పరిగణిస్తున్నారు. ఫలితంగా పుత్తడి ధర మెరుపులు మెరిపిస్తూ కొత్త రికార్డుల పుంతలు తొక్కుతోంది. సోమవారం దేశీయ బులియన్ మా ర్కెట్లో తులం బంగారం (24 క్యార ట్స్) ధర రూ.250 వృద్ధితో రూ.78,700 ల జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది.

దేశీయంగా జ్యువెల్లరీ వ్యాపారులు, కస్టమర్ల నుంచి గిరాకీ పెరగడంతోపాటు అం తర్జాతీయ మార్కెట్లలోనూ బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం తో ధర పెరుగుతోంది. శుక్రవారం తులం బంగారం ధర రూ.78,450 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే, శుక్రవారం ధరతో పోలిస్తే కిలో వెండి ధర సోమవారం రూ.200 తగ్గి రూ.94 వేల వద్ద స్థిర పడింది.ఇక సోమవారం దేశీయ బులియన్ మా ర్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత గల బం గారం తులం ధర రూ.200 పుంజుకుని రూ.78,300 వద్ద నిలిచింది.