రూ.77,890కి చేరిన తులం
హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ ప్రధాన కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్‌లో బంగారం పరుగులు తీయడంతో దేశీయంగా సైతం ధర పుంజుకున్న ది. రానున్న ధనతెరాస్, దీపావళి నేపథ్యంలో స్థానికంగా డిమాండ్ పెరుగుదల సైతం పుత్తడి జొరుకు కారణమయ్యింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర బుధవారం కొత్త రికార్డుస్థాయి రూ.77,890 వద్దకు చేరింది. అక్టోబ ర్ తొలివారంలో నమోదైన రూ.77,670 ధరను తాజాగా అధిగమించింది. ఇదేబాటలో 22 క్యారట్ల ఆభరణాల బంగారం ధర రూ.71,400 వద్దకు చేరుకున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ఫ్యూచర్ ధర 22 డాలర్లు పెరిగి 2,682 డాలర్ల వద్ద నిలిచింది.